కామారెడ్డి, మే 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో ఉన్న ప్లాట్లు, వివిధ నిర్మాణ దశలలో ఉన్న గృహాల కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షనల్ లో శనివారం ఫ్రీ బెడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అడ్లూరు గ్రామ శివారు లోని ధరణి టౌన్షిప్లు డిటిసిపి లే అవుట్ అఫ్వరోల్ ఉన్న ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసి లబ్ధిదారులు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని సూచించారు.
ధరణి టౌన్షిప్లు మౌలిక వసతుల కల్పన కు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. విద్యుత్ సౌకర్యం, రోడ్లు, తాగునీటి వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. దశలవారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఓపెన్ ఫ్లాట్ల కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.
కొనుగోలు చేసిన గృహాలకు బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఎల్డి ఎం రమేష్ ఆర్డీవో శీను, కలెక్టరేట్ ఏవో రవీందర్, ధరణి టౌన్షిప్ అధికారులు, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.