నిజామాబాద్, మే 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర నిర్వహిస్తున్న యోగా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అంగన్వాడీ టీచర్లకు యోగా, ఆరోగ్యవంతమైన జీవన విధానాల మీద శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక టిఎన్‌జివోస్ భవన్‌లో నిర్వహించారు.
కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ యోగా మన నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవడం వల్ల మనం ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చని, ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను మనం యోగా ద్వారా నిలువరించవచ్చని సూచించారు.
యోగా శిక్షకురాలు సంగీత యోగాసనాలు వాటి ప్రాముఖ్యత, యోగా యొక్క ఆవశ్యకత తెలిపారు. అంగన్వాడీ టీచర్ల చేత యోగాసనాలు చేయించారు, ప్రాణాయామం, మెడిటేషన్ చేసే పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.