కామారెడ్డి, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూలై 1 నుంచి కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ సమావేశంలో మాట్లాడారు. కిరాణా దుకాణాలు క్యారీ బ్యాగులు వాడవద్దని సూచించారు.
జ్యూట్ బ్యాగులు, బట్టల సంచులు వాడాలని కోరారు. మటన్, చికెన్ దుకాణాలలో క్యారీ బ్యాగులు వాడవద్దని పేర్కొన్నారు. టిఫిన్ బాక్సులలో ప్రజలు మటన్, చికెన్ తీసుకెళ్లే విధంగా గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డిపిఓ శ్రీనివాస్, డిఆర్‌డిఓ సాయన్న, మున్సిపల్ కమిషనర్లు దేవేందర్, జగ్జీవన్, స్వచ్ఛభారత్ అధికారులు మధు కృష్ణ, నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.