డిచ్‌పల్లి, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో పరిశోధక విద్యార్థి పి. మౌనికకు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) ను శుక్రవారం ఉదయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని సెమినార్ హాల్‌లో నిర్వహించారు.
బిజినేస్ మేనేజ్ మెంట్ విభాగంలోని అసోసియేట్ ప్రొఫెసర్, పాఠ్యప్రణాళిక సంఘం చైర్ పర్సన్ డా. జి. వాణి పర్యవేక్షణలో ‘‘హ్యూమన్ రీసోర్స్ ప్రాక్టీసెస్ ఇన్ ఎస్‌బిఐ అండ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్స్ – ఎ కంపారిటీవ్ స్టడీ’’ అనే అంశంపై పిహెచ్. డి. పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించి టీయూకు సమర్పించారు. వైవా – వోస్ కు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్‌గా హైదాబాద్‌లోని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కామర్స్ అండ్ మెనేజ్ మెంట్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎ. సుధాకర్ విచ్చేసి సిద్ధాంత గ్రంథంపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.
ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లలో మానవ వనరుల సాధన, కృషి, బాధ్యతలు ఏ విధంగా ఉండాలో పరిశోధకురాలు తులనాత్మకంగా అధ్యయనం చేశారని ప్రశంసించారు. వైవా – వోస్‌కు చైర్మన్‌గా బిజినెస్ మేనేజ్ మెంట్ ఫ్యాకల్టీ పీఠాధిపతి ప్రొఫెసర్ కైసర్ మహ్మద్, కన్వీనర్‌గా బిఒఎస్ డా. జి. వాణి వ్యవహరించారు. విభాగాధిపతి డా. కె. అపర్ణ, అధ్యాపకులు డా. రాజేశ్వరి, డా. ఆంజనేయులు తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పి. మౌనిక డాక్టరేట్ సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్. ఆరతి, కంట్రోలర్ ఆచార్య ఎం. అరుణ, పీఆర్‌ఓ డా. వి. త్రివేణి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారు.