డిచ్‌పల్లి, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనాన్ని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు. పరిపాలనా భవనంలో గల పరీక్షల నియంత్రణా విభాగం, అకౌంట్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్, డైరెక్టరేట్ ఆఫ్ ఆడిట్ ఆఫీస్, ఎఓ ఆఫీస్, ఎస్టేట్ ఆఫీస్, పబ్లికేషన్ సెల్, అడ్మిషన్స్ డైరక్టరేట్ ఆఫీస్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, ఇడిపి సెక్షన్, పబ్లిక్ ఇన్ ఫర్మేషన్ ఆఫీస్, ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీస్, యూజీసీ ఆఫీస్, పిఆర్‌ఓ ఆఫీస్ పర్యవేక్షించారు.
ఆయా కార్యాలయాలలోని సిబ్బంది హాజరును పరిశీలించారు. ప్రస్తుతం ఆయా కార్యాలయాలలో సిబ్బంది చేస్తున్న పనిని అడిగి తెలుసుకున్నారు. పనుల్లో అలసత్వం గాని, హాజరులో నిర్లక్ష్యం గాని వహించకూడదని సిబ్బందికి సూచించారు.