ఆర్మూర్, జూన్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ 2 వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక కౌన్సిలర్ సంగీత ఖాందేశ్ కాలోనిలో పర్యటించారు. కాలనీలో వున్న విద్యుత్ సమస్యలు, లాంగ్ సర్వీస్ వైర్లు వున్న చోట ఇంటర్ పోల్లు బిగించాలని లైన్ఇన్స్పెక్టర్ నరేందర్ నాయక్‌కు సూచించారు.
అలాగే లైన్ మెన్ రామచందర్, శ్రీనివాస్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో విఆర్వో అమృతరావ్, సత్యానంద్ మున్సిపల్ సిబ్బంది దొండి రమేష్ , ఆర్పి మమత, తెరాస నాయకులు ఖాందేశ్ సత్యం తదితరులు పాల్గొన్నారు.