కామారెడ్డి, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఈ నెల 8 న ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వ హించనున్నట్లు కామారెడ్డి లీడ్ బ్యాంక్ మేనేజర్ చిందం రమేశ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా చేరువ కార్యక్రమాన్ని స్థానిక శుభం కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సంయుక్తంగా ఉదయం 10.00 గంటలకు ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రుణ వితరణ కూడ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని 18 బ్యాంకుల అధికారులు, వ్యవసాయ శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెప్మా, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. 18 బ్యాంకర్ల స్టాల్స్ ఏర్పాటుతో పాటు బ్యాంకర్లు అందిస్తున్న రుణాలు, వడ్డీరేట్లు తదితర అంశాలపై వినియోగదారులకు వివరిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి లీడ్ బ్యాంక్ మేనేజర్ చిందం రమేశ్ ప్రకటనలో కోరారు.