వర్ని, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చందూర్ మండల కేంద్రంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో తమ జెడ్పీ ప్లోర్ లీడర్ గిరిజన నాయకుడు చందూర్ జెడ్పిటిసి అంబర్ సింగ్ స్థానిక సమస్యలపై మాట్లాడుతుంటే కండువా తీసి మాట్లాడాలని తెరాస నాయకులు అడ్డుకోవడం సిగ్గుచేటని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, కామారెడ్డి జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం వర్నిలో విలేకరులతో మాట్లాడారు.
సాక్షాత్తు సభాపతి ముందు అవమానం జరగడం, ఇంత జరుగుతున్నా ఏమి అనకపోవడం ప్రజలు గమనిస్తున్నారని, సభాపతి ముందు తెరాస నాయకులు కండువాలు వేసుకుని జై టీఆర్‌ఎస్ అంటే తప్పులేదు కానీ మూడు రంగుల కండువా వేసుకుని మాట్లాడుతుంటే జీర్ణించుకోలేక టీఆర్‌ఎస్ కార్యకర్తలు గొడవకు దిగడం ఎంతో సిగ్గుచేటన్నారు.
ఏ ప్రోటోకాల్ లేకుండా మీ కుమారుడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్న మీ పార్టీలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఏమి అనలేక ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులను అవమాన పరుస్తున్నారని అది మీ పార్టీ వాళ్ళు ఉరుకున్నా తమ ప్రజా ప్రతినిధులను అవమాన పరిస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు.
జెడ్పి ప్లోర్ లీడర్‌ను అవమానపరిచినారని వెంటనే అంబర్ సింగ్‌కు తెరాస నాయకులు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. స్పీకర్ ఈ విషయమై మాట్లాడాలని కళ్లముందు ఇంత జరుగుతున్నా తెరాస నాయకులను ఏమి అనక పోవడం దారుణమన్నారు. సమావేశంలో దామరంచ సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, గజ్జెల సాయిలు, మారుతి సేట్, మోయిన్, బోయుడి లక్ష్మణ్, నసీం, తులసీరాం, అహ్మద్, సంగం సాయిలు, దయానంద్ సాగర్ పాల్గొన్నారు.