డిచ్పల్లి, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో పరిశోధక విద్యార్థి భానోత్ రమేష్ పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా (మౌఖిక పరీక్ష) మనగళవారం నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విశ్రాంతాచార్యులు ఆచార్య ననుమాస స్వామి పర్యవేక్షణలో పరిశోధకులు ‘‘తెలంగాణ ఆధునిక నవలలు – మానవ విలువలు – ఒక పరిశీలన (1990-2010) అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రూపొందించి టీయూకు సమర్పించారు.
పిహెచ్. డి. ఓపెన్ వైవాకు ఎక్సటర్నల్ ఎగ్జామినర్‌గా తిరుపతి నుంచి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగం ప్రొఫెసర్ కె. మధుజ్యోతి విచ్చేసి పరిశోధక విద్యార్థిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతరించిపోతున్న మానవ విలువలను గూర్చి, తెలంగాణ నవలల్లో ప్రతిబింబింపబడిన పాత్రానుగతంగా రచయిత ప్రవేశ పెట్టిన మానవ విలువలను గూర్చి విశ్లేషణ చేయడం ముదావహం అని పరిశోధకుడిని ప్రశంసించారు.
వైవా వోస్‌కు ఆర్ట్స్ డీన్ ఆచార్య పి. కనకయ్య చైర్మన్‌గా, బిఒఎస్ డా. జి. బాలశ్రీనివాస ముర్తి కన్వీనర్‌గా వ్యవహరించారు. ఇందులో విభాగాధిపతి డా. కె. లావణ్య, అసోసియేట్ ప్రొఫెసర్ డా. డా. వి. త్రివేణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి, ఇతర విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వైవా వోస్‌కు విచ్చేసిన పర్యవేక్షకులు ఆచార్య ననుమాస స్వామిని, ఎక్సటర్నల్ ఎగ్జామినర్‌గా విచ్చేసిన ఆచ్చార్య మధుజ్యోతిని వీసీ గౌరవపూర్వకంగా సన్మానం చేశారు. భానోత్ రమేష్ పిహెచ్. డి. డాక్టరేట్ సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, కంట్రోలర్ ఆచార్య ఎం. అరుణ, ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. ఆరతి తదితరులు అభినందనలు తెలిపారు.