నిజామాబాద్, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం తెల్లవారుజామున తొలకరి జల్లు పలకరించి పరవశింపజేసింది. సాధారణంగా మృగశిర కార్తె రోజు తప్పకుండా వర్షం కురుస్తుందని భావిస్తారు. కాగా బుధవారం సాయంత్రం ఈదురుగాలులు వీచినప్పటికి వాన జాడ కానరాలేదు. కానీ తెల్లవారేసరికి వరుణుడు కరుణించాడు. రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్‌లో పలుచోట్ల వాన ముసురుపట్టినట్టుగా కురుస్తూనే ఉంది. మరోవైపు వాతావరణ శాఖ కూడా మూడురోజులు వానలున్నాయని సూచించింది. ఏదేమైనా వానకాలం మొదలైందని అనిపిస్తుంది.