నిజామాబాద్, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముగ్గురి ప్రాణాలను కాపాడిన డయల్ 100 సిబ్బందిని అభినందిస్తూ నిజామాబాద్ పోలీస్ కమీషనర్ నాగరాజు ప్రశంసించారు. 9వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో డయల్ 100 కు ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదుకు సత్వరమే స్పందించి నిజామాబాద్ రైల్వే స్టేషన్ యందు వరంగల్ జిల్లాకు చెందిన సుమలత (40), శ్రీనిఖీ (14), శ్రీహిత (10) లు ఇంట్లో గొడవ వలన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిని ఎలాంటి ప్రాణ నష్టం కలుగకుండా కాపాడారు.
అనంతరం టౌన్ 1 ఎస్.హెచ్.ఓ డి. విజయ్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఈ నేపథ్యంలో శనివారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు వారిని అభినందించారు.
పోలీసు సిబ్బంది వివరాలు
- ఎస్.భాస్కర్, పి.సి 1448
- జి. రాజగోపాల్, పి.సి 2142
- బి. రాజేష్, పి.సి: 2154 లకు ప్రశంసా వ్రతము మరియు రివార్డు ఇచ్చి అభినందించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ప్రతీ సిబ్బంది ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీహారి, టౌన్ 1 ఎస్. హెచ్.ఓ, డి. విజయ్ తదితరులు ఉన్నారు.