సర్కారు బడికి జడ్జి కూతురు

నిజామాబాద్‌, జూన్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలే ప్రతిభాపాటవాలకు,ఉన్నతమైన చదువులకు, మేధా సంపత్తి గల ఉపాధ్యాయులకు అత్యుత్తమ విద్యాలయాలని నిరూపించారు నిజామాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌ కుమార్‌ జాదవ్‌, ప్రియాంక జాదవ్‌ దంపతులు. వీరిద్దరి ఐదేళ్ల కూతురు అంబికా జాదవ్‌ను నిజామాబాద్‌ నగరంలోని చంద్రశేఖర్‌ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో బుధవారం ప్రవేశపత్రం నింపి జాయిన్‌ చేశారు.

ఈ సంధర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంగోపాల్‌ రెడ్డి మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతవిద్యావంతులలైన ఉపాధ్యాయులకు కొదువలేదని, ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నవారు ప్రభుత్వ పాఠశాలలో వారి సంతానాన్ని చేర్పించడం బడుగు, బలహీనవర్గాల వారికి ఉత్తేజాన్ని కలిగిస్తుందని, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »