చైనాలో ఏ జరుగుతోంది…అసలు మానవ హక్కులున్నాయా… చెప్పిన మాట వినకుంటే చైనా ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాలు చాల మందికి తెలియవు.. అక్కడ వ్యక్తి స్వచ్చ ఉందా అంటే అనుమానమే…
భౌద్దులను తరిమిన చైనా ఇప్పుడు ఇతర మతస్తుల ఉసురు పోసుకుంటోంది. లక్షల సంఖ్యలో బైబిళ్లను తగుల బెట్టినట్టు వార్తలు వచ్చినా సోకాల్ట్ మేధావులు కిమ్మన్న దాఖలాలు లేవు. ప్రపంచానికి కనిపించకుండా చేసే చైనా దుష్చర్యలు ఎన్నున్నాయో చెప్పనలవి కావు.
చైనాలో నివాసముంటున్న జాతుల్లో వీగర్ ముస్లీ తెగ ఒకటి. చీనీ లోని షిన్ జియాంగ్ ప్రాంతంలో ఈ ముస్లీ తెగలు నివాసముంటున్నాయి. ఇప్పుడు ఈ తెగలను అంతమొందించే దిశగా చైనా ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
ఆండ్రియన్ జెంజ్ అనే స్కాలర్ చేసిన పరిషోదనలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెళ్లడయ్యాయి. చైనాలో నివసించే వీగర్ ముస్లీ మహిళలతో చేసిన ఇంటర్వ్యూ లతో ఆధారంగా జెంజ్ తన నివేధికను రూపొందించారు. వీగర్ ముస్లీం జనాబాను తగ్గించేందుకు చైనా ప్రభుత్వం బలవంతపు గర్భస్రావాలకు పాల్పడుతోందని వెల్లడైంది.
మరికొందరు మహిళలకు బలవంతంగా కుటుబ నియంత్రణ పరికరాలు అమరుస్తున్నట్టు జెంజ్ తన నివేదికలో పేర్కోన్నారు. మహిళల పట్ల చైనా పూర్తి అమానవీయంగా ప్రవరిస్తున్నట్టు వెళ్లడవడంతో ప్రపంచం విస్తు పోతుంది.
చైనా దుష్చర్యల వల్ల 2015, 2018 మధ్య కాలంలో వీగర్ ముస్లీంల జనాభా గణనీయంగా తగ్గినట్టు పరిషోధనలో వెల్లడైంది. జనాభా పెరుగుదల 84 శాతానికి పైగా పడిపోయినట్టు జెంజ్ తన నివేధికలో వెళ్లడించారు.
మాట వినని వీగర్ తెగ మహిళలను కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలిస్తున్నట్టు రిపోర్టు్ల్లో పేర్కోన్నారు. షీన్ జియాంగ్ ప్రాంతంలో చైనా నిర్వహిస్తున్న క్యాంపుల్లో మహిళలకు సంతాన నిరోధక ఇంజెక్షన్లు ఇచ్చినట్టు అక్కడి మహిళలు చెప్పినట్టు రిపోర్టులో తెలిపారు. ఇంకా మహిళలకు బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినట్టు పరిషోధనలో వెళ్లడైంది.