కామారెడ్డి, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తడి, పొడి చెత్తను ప్రజలు వేరు చేసే విధంగా మెప్మా రిసోర్స్ పర్సన్లు అవగాహన కల్పించాలని సూచించారు.
ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. పట్టణంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి, గుంతలను తీయించాలని కోరారు. వచ్చే హరితహారంలో మొక్కలు నాటాలని సూచించారు. నర్సరీలో అవసరమైన మొక్కలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, అధికారులు పాల్గొన్నారు.