నిజామాబాద్, జూన్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పట్టణంలో తమ పిల్లలను అనుమతి, గుర్తింపు ఉన్న పాఠశాలలో మాత్రమే చేర్పించాలని తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో సూచించారు.
ఇటీవల మై చోటా స్కూల్ పేరుతో రెండు బ్రాంచ్‌లు నిజామాబాద్‌లో ప్రారంభించినట్టు ఫ్లెక్సీలు కనబడుతున్నాయని, ఈ పాఠశాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి, గుర్తింపు లేదని, కావున తల్లిదండ్రులు అటువంటి పాఠశాలలో పిల్లలను చేర్పించకూడదని చెప్పారు. ఈ పాఠశాలలను తక్షణమే మూసి వేయాల్సిందిగా మండల విద్యాశాఖాధికారికి ఆదేశించారు.
అలాగే శిక్షణ సంస్థలు ఆకాశ్, వికాస్, ఎస్‌ఎస్ రీడిరగ్ రూమ్స్, ఐ5 మొదలగు సంస్థలు ఎటువంటి గుర్తింపు లేకుండా నడుస్తున్నాయని, వీటిని కూడా తక్షణమే మూసివేయాల్సిందిగా మండల విద్యాశాఖాధికారిని ఆదేశించారు.