బోధన్, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ఆర్డీవో రాజేశ్వర్ రావు పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా డ్రైనేజీలో చెత్తాచెదారం లేకుండా చూడాలని పట్టణ ప్రగతిలో బోధన్ పట్టణం సుందరీకరణగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, ఎసై శంకర్, పాల్గొన్నారు.