నిజాంసాగర్, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగి సీజన్‌లో వేసిన పంటలు అమ్ముకున్న రైతులు ప్రస్తుతము వానకాలం సీజన్ పంటలపై దృష్టి మళ్ళించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. తెలంగాణ సర్కార్ అన్నదాతలు ఆదుకోవడానికి 2018 లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రెండు పంటలకు పది వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందిస్తుంది.
జూన్ మొదటి వారం వరకు పెట్టుబడి సహాయం అందుతుందని ఆశతో ఉన్న అన్నదాతల్లో నిరాశే మిగిలింది. వానకాలం సీజన్ గాను రైతుబంధు పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇప్పటివరకు వ్యవసాయ శాఖకు ఇలాంటి ఇ ఆదేశాలు జారీ కాకపోవడంతో అన్నదాతలకు రైతుబంధు అనే విషయంలో ఇంకా జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం రాష్ట్రంలో రైతులకు కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఖరీఫ్ సీజన్ ఇది వరకు ప్రారంభం కావాల్సి ఉండగా తొలకరి పలకరించిన రైతన్న ఆకాశం వంక చూడకుండా ప్రభుత్వం సాయం వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఖరీఫ్‌లో నిజామాబాద్ జిల్లాలో రైతులు ప్రధానంగా పోట్ట కోసం వరిసాగును చేస్తారు. ఇప్పటికే రైతులు తమకు కలిగినంతలో దుక్కి దున్నిన పంటల సాగుకు విత్తనాల కోసం సబ్సిడీ విత్తనాల కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వం నుంచి దాదాపు సబ్సిడీపై విత్తనాల సరఫరా ఊసే లేకుండా పోయింది. వరి విత్తనాలు దాదాపు రైతుల డీలర్ల వద్ద నుంచి విత్తనాలు కొనుగోలు చేయడంలో సందడిగా గడుపతున్నాడు. సాగుకు సిద్ధమౌతున్నారు. విత్తనాల కోసం విత్తనాల డీలర్‌ను నమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకోంది. ఎరువుల విషయానికి వస్తే ఇది వరకు ఉన్న బఫర్ స్టాక్ మాత్రమే మిగిలింది. దానికి తోడు ఎరువుల ధరలు పెరిగాయ్. ఇటీవల ఇంధన ధరలు పెరగడంతో సాగు వ్యయం కూడా రైతులకు అదనపు భారం కానుంది. ఇక వ్యవసాయం సాగుకు ప్రభుత్వం ఇచ్చే సహాయం (రైతు బంధు) డబ్బుల రైతుల ఖాతాలో జమ కాలేదు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సుమారు 11 లక్షల ఎకరాలు సాగు అవుతుందని అంచనా. ముఖ్యంగా వానకాలం పంటగా ఇంటి కోసం వరిని సాగు చేయడం అనవాయితీగా వస్తుంది. ఉమ్మడి జిల్లాలో సింహ భాగం వరి వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు మొక్కజొన్న సాగుకు రైతులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలో మాత్రమే వర్షాదార పంటలు అయిన కందులు, పెసలు, మినుములు సాగుకు రైతులు ఆసక్తి చూపుతారు.
ఇదివరకే జిలుగు విత్తనాల సరఫరా కావడంలో ఆలస్యం అయింది. నిజామాబాద్ జిల్లాలో 5.90 లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 5.16 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 50 శాతం సబ్సిడీ పై వరి మినహా మిగిలిన పంటలకు సంబంధించిన విత్తనాల లభ్యత పై స్పష్టత లేకపోవడంతో రైతులు ప్రైవేట్ సీడ్ కంపెనీలను నమ్ముకోవాల్సిన పరిస్థితి ఇది మరింత భారం కానుంది.
ఇప్పటికే గడిచిన రబి సీజన్ కంటే అధికంగా ఇంధన ధరలు పెరగడంతో యంత్రాలను నమ్ముకుని సాగు చేసే రైతులకు అదనపు భారమే. ఇటీవల జరిగిన కోతల సమయంలో అది స్పష్టమైంది. ఇప్పటికే వ్యవసాయ కూలీల లభ్యత అంతంత మాత్రమే ఉండగా యంత్రాలను నమ్ముకోవడం కర్షకులకు ఆర్థిక భారమే.
వానకాలం తొలకరి పలకరించిన రైతులు వ్యవసాయం వైపు చూడకపోవడానికి ప్రధానంగా గత రబిసీజన్‌కు సంబంధించిన ధాన్యం డబ్బులు రాకపోవడమే. ఉమ్మడి జిల్లాలో 6.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన అందుకు సంబంధించిన డబ్బులు మాత్రం పూర్తిగా రైతుల ఖాతాలో జమ కాలేదు. కామారెడ్డి జిల్లాలోని అన్నదాతలు వద్ద నుంచి దాన్యం కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 100 కోట్ల రూపాయలు దాని డబ్బులచెల్లించవలసఉంది.సీజన్ పండిరచిన డబ్బులు రాకపోగా ప్రభుత్వం పంటల సాయం కోసం ఇచ్చే రైతు బంధు ఇవ్వకపోవడంతో రైతులు వ్యవసాయం సాగు చేయాలంటే అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను, కమీషన్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 5 లక్షల 26,208 మంది రైతులకు గాను రూ.525.29 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో వారి ఖాతాకు చెరాలి. కానీ ప్రభుత్వం వద్ద నిధుల లేమికి తోడు ఇప్పటికి వ్యవసాయ రుణ ప్రణాళిక అనేది స్పష్టం చేసిన దానికి అనుగుణంగా బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేకపోవడం ప్రధాన కారణం. రైతులు ఇటు రైతు బంధు డబ్బులు రాక, గడిచిన పంటకు సంబంధించిన ధాన్యం డబ్బులు జమ కాకపోవడం వారి పరిస్థితి దయనీయంగా మారింది.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన జిల్లాలో సాగుకు సరిపడా ఎరువులు లేవు. ఉన్నదంతా బఫర్ స్టాక్ మాత్రమే. దానిని రైతులకు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్న అవి ఏ మూలకు సరిపోవనేది నగ్న సత్యం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 1 లక్ష 40 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. ఈ సీజన్‌లో నిజామాబాద్ జిల్లాలో 87 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా ప్రస్తుతం ఉన్న బఫర్ స్టాక్ నిలువలు 25 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే. కామారెడ్డి జిల్లాలో 53,661 టన్నుల ఎరువులు కావాల్సి ఉండగా అక్కడ అత్యల్పంగా 5 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ స్టాక్ మాత్రమే ఉంది. దానితో రైతులకు ఈసీజన్‌లో ఎరువులు అందుబాటులోకి రావడం కష్టమే.
కేంద్రం ఎప్పుడు పంపిస్తుంది అవి జిల్లాకు చెరుదేపుడు రైతులు అందేది ఎప్పుడు అనేది బిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ప్రభుత్వ గోదాంలలో ఉన్న సరుకు సరిపోదని ముందే తెలుసో ఏమో గాని ఫర్టిలైజర్ వ్యాపారులు ఎరువుల ధరలను అమాంతంగా పెంచేశారు. కాంప్లెక్స్ ధరలు ఆకాశన్నంటుతుండటంతో రైతులకు ఈ సీజన్ వ్యవసాయం మొయలేని బారమే. వ్యవసాయ అధికారులు ఈ విషయం ను మాత్రం నిర్ధారించడం లేదు. ఒకవైపు తీసుకున్న లక్ష రూపాయల రుణమాఫీ ఇప్పటివరకు ప్రభుత్వం మాఫీ చేయలేదు, రుణమఫీ కోసం ఏళ్ల తరబడి అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.
మరోపక్క ఉచితంగా ఎరువులు అందిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ మాట దాటవేశారు. రైతులను రాజుల నుంచి ఇస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం వారిని అయోమయానికి గురి చేస్తుంది. ఒకవైపు పెట్టుబడి సాయం అందక, మరోపక్క బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో అన్నదాతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.