కామారెడ్డి, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం రాయితీ కల్పించాలని టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పత్రికల్లో పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ పనిచేస్తున్న తమ జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల ఫీజులో 50 శాతం రాయితీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లా విద్య అధికారి రాజు స్పందిస్తూ జర్నలిస్టుల సంఘం కోరిన విధంగా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలని ప్రోసిడిరగ్ కాపీని అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిద్దా గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కన్వీనర్ బొంపల్లి ప్రవీణ్ గౌడ్, అక్రిడేషన్ కమిటీ మెంబర్ కృష్ణమూర్తి, నేషనల్ కమిటీ మెంబర్ కృష్ణ చారి, జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణకర్, నాయకులు మోహన్, సునీల్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.