కామారెడ్డి, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బండి స్వామి గౌడ్ గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇంటి వద్దనే ఉన్నాడు, విధులకు హాజరు కావాలని శనివారం ఆర్టీసీ అధికారులు ఫోన్ చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి ఆర్టిసి డిపో మేనేజర్ మల్లేష్, ఆర్.ఎం.సీఐ అధికారుల వేధింపుల వలన తన భర్త బండి స్వామి గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని భార్య శిరీష కుటుంబ సభ్యులు తెలిపారు.
అధికారుల వేధింపుల వల్ల మృతి చెందిన బండి స్వామి గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడి కుటుంబానికి 25 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.