కామారెడ్డి, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వ నిధి సే సమృద్ధిలో భాగంగా వీధి వ్యాపారులు, వారి యొక్క కుటుంబ సభ్యులకు అర్హతగల వారికి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ పథకాల పై సమీక్ష నిర్వహించారు.
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, భవన నిర్మాణ, ఇతర కార్మికుల నమోదు, శ్రమ యోగి మాన్ దన్ యోజన, ఒకటే జాతీయత ఒకే రేషన్ కార్డు కలిగి ఉండుట, జనని సురక్ష యోజన, మాతృ వందన యోజన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
అర్హతగల పేదలకు లబ్ధి చేకూర్చాలని పేర్కొన్నారు. సమావేశంలో మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారి రాజశేఖర్, జిల్లా వైద్య వైద్య ఆరోగ్య శాఖ, కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.