కామారెడ్డి, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి సోమవారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
కార్యక్రమంలో సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, కలెక్టరేట్ ఏవో రవీందర్, టిఎన్జిఎస్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిలు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవ రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.