నిజామాబాద్, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్, వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 475 కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్, వర్కర్లు అనేక రకాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి ఇప్పటికీ కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోకెల్లా అతి తక్కువ వేతనాలు కేజీబీవీ సిబ్బందికి ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటన మేరకు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కేజీబీవీ నాన్ టీచింగ్ స్టాఫ్, వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలన్నారు.
నాన్ టీచింగ్, వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులను పెంచి, ముఖ్యంగా కుక్, స్కావేంజర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ అయిన కేజీబీవీల్లో అదనంగా సిబ్బందిని, వర్కర్లను వెంటనే నియమించాలన్నారు. అకౌంటెంట్, ఏ.ఎన్.ఎం, వర్కర్ల బదిలీలు చేపట్టాలన్నారు. అన్ని కేజీబీవీల్లో రెండో ఏ.ఎన్.ఎంను నియమించాలన్నారు. కంప్యూటర్, ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్లకు ఫుల్ టైం వేతనం ఇవ్వాలన్నారు. మూడు నెలలుగా వేతనాలు రాని కొత్త అకౌంటెంట్లకు వెంటనే వేతనాలు ఇప్పించాలన్నారు.
కేజీబీవీ ఉద్యోగులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఆరోగ్య కార్డులు ఇవ్వాలన్నారు. పదవీ విరమణ చేసిన వారికి మరియు మరణించిన వారికి గ్రాట్యుటీ చెల్లించాలనారు. వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. అన్ని కేజీబీవీల్లో నాన్ టీచింగ్, వర్కర్లకు వీక్లీ ఆఫ్ అమలు చేయాలన్నారు.
కేజీబీవీ నాన్-టీచింగ్, వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలన్నారు. వెంటనే ప్రభుత్వం నాన్ టీచింగ్, వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 కేజీబీవీలను సమ్మెలోకి దించుతామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సాయంత్రం డీఈవోతో సమీక్షిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి.ఈశ్వరి, రాష్ట్ర నాయకులు హేమలత, నాయకులు శోభ, సుమలత, అశ్విని, ప్రభోదిని, మోతి, సువర్ణ, సుకన్య, సరస్వతి, సావిత్రి, లక్ష్మి, ఆండాలు, విజయలక్ష్మి, సీతామహాలక్ష్మి, గంగామని, సుజాత, మమత తదితరులు పాల్గొన్నారు.