నిజాంసాగర్, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువతలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది, దానిని వెలికి తీస్తే ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగ గలుగుతారు. కానీ వారికి ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక వారు కళలకు దూరమవుతున్నారు.
కామారెడ్డి జిల్లాకు చెందిన కళాకారుడు జీవన్ నాయక్ జీవితంలో అవరోధాలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ సూక్ష్మ కళాకారుడుగా పేరు గాంచాడు. బాన్సువాడ మండలం పోచారం తండాకు చెందిన చిత్రకారుడు జీవన్ నాయక్ మంగళవారం జరగనున్న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా రావి ఆకుపై యోగ చిత్రాన్ని చెక్కి తోటి కళాకారులను అబ్బురపరిచారు. తను ఇంతకుముందు సూక్ష్మ చిత్రీకరణలో పలు జాతీయ అవార్డులు అందుకున్నట్లు జీవన్ నాయక్ నిజామాబాద్ న్యూస్‌తో వెల్లడిరచారు.