కామారెడ్డి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిబీపేట మండలం రామ్ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన లావణ్య నేటి యువతకు స్ఫూర్తిదాయకమని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు అన్నారు.
గత 3 సంవత్సరాల నుండి ఓ నెగెటివ్ రక్తాన్ని 6 సార్లు అంద చేయడమే కాకుండా అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి రక్తం అవసరం అని చెప్పగానే హైదరాబాద్కి వెళ్లి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని, ఆమెకు సమాజం పట్ల ఉన్న సేవనిరతికి నిదర్శనమని, ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రశంసా పత్రం, జ్ఞాపికను ఇచ్చి అభినందనలు తెలిపారు.