బాబాయ్‌కు రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పిట్ల నారాయణ (57) కి ఆపరేషన్‌ నిమిత్తమై అత్యవసరంగా ఏ పాసిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబసభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించారు. కాగా కామారెడ్డి జిల్లా రక్త దాతల సేవ సమితి వారు పిట్ల నారాయణ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి వారి కుటుంబంలోని పిట్ల నవీన్‌ కుమార్‌ సహకారంతో వారికి కావాల్సిన ఏ పాసిటివ్‌లి రక్తం అందజేశారు.

వెంటనే స్పందించి రక్తదానానికి ముందుకు వచ్చిన పిట్ల నవీన్‌ కుమార్‌కి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వడ్ల సురేష్‌ కుమార్‌, పిట్ల ప్రవీణ్‌ మరియు కెబిఎస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »