కామారెడ్డి, జూన్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి సిహెచ్‌సిని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో వసతుల వివరాలను సూపరింటెండెంట్ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేవిధంగా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
గర్భిణీల నమోదు సక్రమంగా చేపట్టాలన్నారు. పోషకాహారం తీసుకునే విధంగా గర్భిణీలకు వైద్యులు అవగాహన కల్పించాలని కోరారు. పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. శిథిలమైన తరగతి గదులను పరిశీలించారు. ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కస్తూరిబా పాఠశాల ను సందర్శించి సమస్యలు అడిగారు. గిరిజన గురుకుల పాఠశాల, వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మధ్యాహ్నం భోజనం చేశారు.