కామారెడ్డి, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనసంఫ్‌ు వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిధాన్ దివస్ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని 23 వ వార్డు పరిధిలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం మొక్కలు నాటి నీరుపోశారు.
ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుంటా లక్ష్మరెడ్డి మాట్లాడుతూ జనసంఫ్‌ు వ్యవస్థాపకులైన శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశంలో జాతీయ భావం విషయంలో యువతకు స్ఫూర్తిగా నిలిచారని, రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఒకే దేశంలో ఉండరాదని ఆర్టికల్ 370 వెంటనే రద్దు చేయాలని డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ రక్షణ శాఖ అనుమతి లేకుండానే జమ్మూకశ్మీర్లో పర్యటించాలని నిర్ణయించారనీ అన్నారు.
కాశ్మీర్‌లో ప్రవేశిస్తున్నప్పుడు డాక్టర్ ముఖర్జీని అరెస్ట్ చేసి, అరెస్టు అయిన 40 రోజుల తరువాత రాత్రి బటోటె పట్టణానికి తరలించారని, మరుసటి రోజు ఉదయం శ్రీనగర్‌కు తరలించారనీ, నిర్మానుష్యమైన చిన్న గదిని సబ్ జైలుగా మార్చి అసౌకర్యాల మధ్య నిర్బంధించారని గుర్తుచేశారు. ఈ క్రమంలో 1953 జూన్ 23వ తేదీ తెల్లవారుజామున భారతమాత ఒడిలో కలిసినట్టు ఆనాటి ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయమైన 370 ఆర్టికల్‌ను రద్దు చేసి నేటి మోదీ ప్రభుత్వం ఆయన అడుగు జాడల్లో నడిచిందన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.