బృహత్‌ ప్రకృతి వనాల కోసం స్థలాలు గుర్తించాలి

కామారెడ్డి, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం ప్రతి మండలంలో స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 26 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేసినట్లు చెప్పారు.

45 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనాలకోసం గ్రామాల్లో స్థలాలు లేకపోతే అటవీ ప్రాంతంలో స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పనులు చేపట్టిన చోటా వర్క్‌ సైడ్‌ బోర్డులు పెట్టాలని కోరారు. జాబ్‌ కార్డుల అప్డేషన్‌ చేయాలన్నారు. ప్రతి మండలంలో ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో కమ్యూనిటీ సోఫీట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.

గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల కోసం అరెకరం ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలన్నారు. జొన్నల కొనుగోళ్లను సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేపట్టాలని పేర్కొన్నారు. జులై 10లోగా వంద శాతం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. జొన్నలు పండిరచిన రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని సూచించారు. ధ్రువీకరణ పత్రాలు తీసుకువచ్చిన రైతుల నుంచి జొన్నలను అధికారులు కొనుగోలు చేస్తారని తెలిపారు.

వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి అవసరమున్న లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కంపోస్టు షెడ్లలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేసి రైతులకు ఎరువులు విక్రయించి పంచాయతీ ఆదాయాన్ని పెంచుకోవాలని పేర్కొన్నారు. వచ్చిన ఆదాయాన్ని రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు. జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే మాట్లాడారు.

పల్లె ప్రకృతి వనాలలో అదనంగా వెయ్యి మొక్కలు నాటాలని సూచించారు. చెరువు కట్టలపై మియావాకి విధానంలో మొక్కలు నాటాలని తెలిపారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల సమీపంలో సోఫీట్‌ లు నిర్మించాలని కోరారు. వర్షపు నీరు వృధా పోకుండా సోఫీట్‌ లోకి మళ్ళించాలని సూచించారు. కంపోస్టు షెడ్లు, వైకుంఠ ధామాలు వంద శాతం వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు.

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణ సక్రమంగా చేపట్టాలని కోరారు. సమావేశంలో లో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, డిఎఫ్వో నిఖిత, డిఆర్‌డిఓ సాయన్న, డిపిఓ శ్రీనివాస రావు, డిఎల్‌పిఓ సాయిబాబా, ఆర్‌డివోలు రాజాగౌడ్‌, శీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »