కామారెడ్డి, జూన్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్న వారికి దాదాపుగా 10 వేలకు యూనిట్లకు పైగా రక్తాన్ని అందించడం జరిగిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో కూడా ప్లాస్మాదానం గురించి అవగాహనతో పాటు 100 యూనిట్ల ప్లాస్మాను కూడా అందజేసి వేలాది మంది ప్రాణాలు కాపాడారు.
ప్రస్తుత తరుణంలో కామారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలోని బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు లేకపోవడం వలన చాలామంది పేషెంట్లు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, ఆపరేషన్ల నిమిత్తమై తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానానికి ముందుకు వచ్చినట్లయితే మీరిచ్చే రక్తంతో తోటి వారి ప్రాణాలు కాపాడిన వారమవుతాము.
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్త జన్మదినం సందర్భంగా (28-06-2022) మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలోనీ బ్లడ్ బ్యాంకులో నిర్వహించే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. రక్తదానం చేయాలనుకున్నవారు ఈ క్రింది వాట్సాప్ నంబర్‌కు తమ వివరాలు పంపాలని, క్రింది నెంబరును సంప్రదించవచ్చునన్నారు. రక్తదానం చేసిన రక్త దాతలకు ప్రశంసా పత్రం అందజేయబడుతుందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు అన్నారు. సెల్ నెంబర్. 9492874006