నీటిని పొదుపుగా వాడుకోవాలి

నిజాంసాగర్‌, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హెడ్స్‌ లూస్‌ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి స్విచ్‌ ఆన్‌ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 6.13 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. వానాకాలంలో నిజాంసాగర్‌ ఆయకట్టులో మొత్తం 1.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు.

జుక్కల్‌, బాన్సువాడ, బోదన్‌ నియోజకవర్గాల పరిదిలో ఆయకట్టు ఉందని తెలిపారు. ఇప్పటికే రైతులు బోర్లు. బావుల క్రింద వరి నారు మళ్ళు పోసుకున్నారు అని తెలిపారు. కాలువల ద్వారా వదిలిన నీరు నాట్లకు ఉపయోగపడుతుందన్నారు. మొత్తం 6 విడతలుగా నీరు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. మొదటి విడతలో నీటిని 20 రోజులు విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

వానాకాలం సాగుకు 9 టీఎంసీలు అవసరం ఉందన్నారు. నీటిని ప్రణాళికాబద్ధంగా విడుదల చేస్తాం అని అన్నారు. వర్షాకాలం కాబట్టి ఇబ్బంది ఉండదు అని అన్నారు.
నీటి విడుదల, ఆయకట్టు అవసరాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం అని అన్నారు. అత్యవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొండపోచమ్మ సాగర్‌ నుండి తెచ్చుకుంటాం అన్నారు. రైతులు నీటిని వృదా చేయవద్దు అన్ని అన్నారు. అవసరమైన మేరకే నీటిని విడుదల చేయడానికి. నీటి వృధాను అరికట్టడానికి పర్యవేక్షణ కోసం డిస్ట్రిబ్యూటర్ల వారిగా కాపలా నియమిస్తున్నామని చెప్పారు.

ఈ విషయంలో ఇరిగేషన్‌ అధికారుల సాంకేతికత అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి గ అనుమతి తోనే నీటిని విడుదల చేస్తున్నాం. నీటి విడుదలకు అనుమతించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ధన్యవాధాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్‌ దపెదర్‌ రాజు, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఆర్డీవో రాజా గౌడ్‌, కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, టిఆర్‌ఎస్‌ నాయకులు దుర్గారెడ్డి, సిడిసి చైర్మన్‌ గంగారెడ్డి, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్‌ గౌడ్‌, సొసైటీ చైర్మన్‌ వాజిద్‌ అలీ, డీఈ శ్రావణ్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »