ఆర్మూర్, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలినడకన గోదావరి నందికి వెళ్లి గంగ నీళ్ళు తీసుకువచ్చి డబ్బుల సప్పుడుతో ఆలూర్‌లో గ్రామ దేవతలకు గంగ నీళ్లు సమర్పించారు.
ఊర్లో వర్షాలు పడి, పాడిపంటలు గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు మామిడి రాంరెడ్డి, ఉపాధ్యక్షులు కుర్మె సతీష్, పిప్పేర మల్లరెడ్డి, గద్దెపెళ్లి సుజిత్, మంతెన తిరుపతి, బద్ధం మధు, మనోజ్, ఉమ్మేడా గంగారెడ్డి, ఇస్సాపల్లి మూతేన్న, బుమన్న, శ్రీనివాస్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.