కామారెడ్డి, జూన్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అగ్నిపథ్‌లో చేరి దేశ సేవ చేయడానికి యువత ముందుకు రావాలని వింగ్ కమాండర్ సజ్జ చైతన్య అన్నారు. గూగుల్ మీట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
17 న్నర ఏళ్ళనుంచి 20 ఏళ్ల లోపు యువత సైన్యంలో చేరవచ్చని సూచించారు. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటిఐ చదివినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాలుగేళ్లపాటు సర్వీస్ ఉంటుందని నెలకు 30 వేల రూపాయల వేతనం లభిస్తుందని చెప్పారు. బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పై పని చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. భారత వైమానిక దళ చట్టం నియమాల ప్రకారం అగ్నిపథ్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. చిన్న వయసులో ఆర్మీలో ఉద్యోగం పొందాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణ కాలం నాలుగు సంవత్సరాల సర్వీస్ ఉంటుందని చెప్పారు. సాయుధ దళాలలో ప్రత్యేక హోదాను కలిగి ఉంటారని పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. బ్యాంకు రుణాలు పొందే వీలు ఉందని చెప్పారు.