జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం

నిజామాబాద్‌, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం (డీఎంఏసి) బుధవారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్లో జరిగింది.

ఆయా ప్రింట్‌ / ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలలో పని చేస్తున్న వర్కింగ్‌ జర్నలిస్టులకు 2022 -2024 సంవత్సరాలకు సంబంధించి జారీ చేయవలసిన కొత్త అక్రిడిటేషన్‌ కార్డుల విషయమై సమావేశంలో కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీ సభ్యులు క్షుణ్ణంగా చర్చించిన మీదట అర్హులైన వారందరికీ కమిటీ చైర్మన్‌ హోదాలో కలెక్టర్‌ ఆమోదం తెలిపారు.

సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్‌.పద్మశ్రీ, ఆర్టీసీ ఆర్‌.ఎం ఉమాదేవి, కమిటీ సభ్యులు ఆర్‌.వెంకటేశ్వర్లు, ఏ.నర్సింలు, జూపల్లి రమేష్‌, కుంచం శ్రీనివాస్‌, అశ్వాక్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎల్‌.బాల్‌ కుమార్‌, కృష్ణ, కె.రవికుమార్‌ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »