నిజామాబాద్, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్పోరేషన్‌లో 2021లో నియమించిన 330 మంది కార్మికులకు పీఆర్పీ అమలు చేయాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్-బిఎల్ టీయూ రాష్ట్ర అద్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. గురువారం యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్పోరేషన్ పరిదిలో 330 మంది కార్మికులను మున్సిపల్ కార్పోరేషన్ నియమించిందన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ 2021లో నియమించిన వారికి అమలు చేయడంలేదన్నారు. కార్మికులు కార్పోరేషన్ ఇతర కార్మికులతో సమానంగా పనిచేస్తున్నప్పుడ్డు వారిక్కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.
అదేవిధంగా వాటర్ సెక్షన్ లోని వివిధ సెక్షన్ లలో పనిచేసే కార్మికులంతా కూడా నైపుణ్యం కలిగిన వారని, వారందరికీ కనీస వేతనం 19,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాటర్, శానిటేషన్, గార్డెన్ లలో పనిచేసే కార్మికులందరికి యూనిఫామ్స్, రేయిన్ కోట్స్, పర్మినెంట్ కార్మికులతో సమానంగా సబ్బులు, నూనేలు ఇవ్వాలన్నారు. వాటర్ సెక్షన్ కార్మికులకు 20 ఏళ్లుగా పనిచేసే వారికి ఫిల్టర్ బెడ్, జోన్ ఆఫీస్, లైన్ మేన్లుగా మేన్ ఆఫీస్ లో అర్హతనుబట్టి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
వాటర్ సెక్షన్ కార్మికులపై పనిభారం తగ్గించడానికి మరో వంద మంది కార్మికులను నియమించాలని కోరారు. ఫిల్టర్ బెడ్, పంప్, ట్యాంక్ ఆఫ్ రేటర్లకు షూ, విద్యుత్ టార్చ్ లైట్స్ ను ఇవ్వాలని, కార్మికులకు ప్రతి నెల మెడికల్ చెకప్ చేయించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, నగర అద్యక్షులు యాదయ్య, కార్యదర్శి గంగా శంకర్, ఉపాధ్యక్షులు హరీశ్, వసంత్, తదితరులు పాల్గొన్నారు.