నందిపేట్, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలం బజార్ కొత్తూరు గ్రామంలో గురువారం సిరికొండ లక్ష్మికి సీ.ఎం. రిలీఫ్ ఫండ్ చెక్కును తెరాస నాయకులు అందించారు. నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ఎంతోమంది పేద వ్యాధిగ్రస్తులకు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఎంఎల్‌ఏ జీవన్ రెడ్డి పేద ప్రజలకు ఆపద్బాంధవుడిగా ఉన్నాడని కీర్తించారు.
కార్యక్రమంలో సర్పంచ్ సంద పోసాని బాబు రాజ్, మండల ఉపసర్పంచుల పోరం అధ్యక్షులు గోపు ముత్యం, మండల మహిళా అధ్యక్షులు కస్తూరి లక్ష్మి, మండల బీ.సీ.సెల్ ఉపాధ్యక్షులు పి.శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు కలిగోట్ సంతోష్, రైతు విభాగం అధ్యక్షులు పి.దామోదర్, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పల్లికొండబజార్ కొత్తూరు గ్రామ తెరాస అధ్యక్షులు కె. గణేష్, ఉపాధ్యక్షులు మచ్చర్ల సాయ రెడ్డి, భువనేశ్వర్, భోజగౌడ్, జక్క నర్సయ్య, తూర్పు రవి, తల్వేద గంగాధర్, పల్లికొండ మల్లయ్య, మండల నాయి బ్రాహ్మణ కోశాధికారి కడారి మోహన్ లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.