డిచ్‌పల్లి, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో గల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రజా సంబంధాల అధికారి డా. వి. త్రివేణి ప్రజా సంబంధాల కార్యాలయానికి డైరెక్టర్‌గా నియామకం పొందారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ నియామక పత్రానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. గురువారం వీసీ చేతుల మీదుగా డా. వి. త్రివేణి డైరెక్టర్ నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… డా. త్రివేణి గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజా సంబంధాల అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని అన్నారు. పీఆర్‌ఓ ఆఫీస్‌లో ఉత్తమ సేవలు అందిస్తున్న నేపథ్యంలో ప్రజా సంబంధాల అధికారి అనే పదవి నుంచి సంచాలకులు (డైరెక్టర్) గా నియామకం చేశామన్నారు. ఇదే గాకా వివిధ పరిపాలనా పరమైన బాధ్యతలను అత్యంత శ్రద్ధతో నిర్వర్తిస్తున్నారని అన్నారు.
ఏ బాధ్యత ఇచ్చినా పట్టుదలతో చేస్తుందని ప్రశంసించారు. సాంస్కృతిక కార్యక్రమాల కో – ఆర్డినేటర్, పరీక్షల అదనపు నియంత్రణాధికారిగా, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా, బాలిక హాస్టల్ చీఫ్ వార్డెన్‌గా, వార్డెన్‌గా, వివిధ కమిటీల సభ్యులుగా పని చేశారని అన్నారు. తెలుగు అధ్యయనశాఖకు అధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళికా సంఘ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారని అన్నారు.
తనను ప్రజా సంబంధాల ఆఫీస్‌కు డైరెక్టర్‌గా నియమించినందుకు డా. త్రివేణి వీసీ, రిజిస్ట్రార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. డా. త్రివేణి డైరెక్టర్‌గా నియమింపబడడం పట్ల పలువురు అధ్యాపకులు, పధ్యాపకేతరులు, విద్యార్థులు, మీడియా మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.