నిజామాబాద్, జూలై 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నలుగురి ప్రాణాలు కాపాడిన పెట్రోకార్ సిబ్బందిని నిజామాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీసు కె.ఆర్. నాగరాజు అభినందిస్తూ ప్రశంసించారు.
వివరాలు ఇలా ఉన్నాయి…
జూన్ 30 మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో డయల్ 100 కు ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదుకు సత్వరమే స్పందించి రేంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దండిగుట్ట ప్రాంతానికి చెందిన తేజావత్ సురేష్ (30), అతనికిచెందిన అఖిల్ (4), నిఖిల్ (2), నితీష్ (10 నెలలు) లు ఇంట్లోతన భార్య (ఉమ) కుటుంబ సమస్యల వలన పై నలుగురు పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా కాపాడారు.
అనంతరం రెంజల్ ఎస్.ఐ సాయన్న ఆదేశాల మేరకు ఆర్. శంకర్, కానిస్టేబుల్ : 2037, కె. శేఖర్ గౌడ్, హోమ్ గార్డు 750 లు కలిసి వారిని ఆత్మహత్య నుండి రక్షించి హుటాహుటిన వారిని పి.హెచ్.సి సెంటర్‌కు తరలించి, తదుపరి వారిని నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఈ సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె. ఆర్. నాగరాజు బోదన్ రూరల్ సి.ఐ జి. శ్రీనివాస్ రాజు, రేంజల్ ఎస్.ఐ సాయన్న, ఆర్. శంకర్, పి.సి: 2037 కె. శేఖర్ గౌడ్, హోమ్ గార్డు 750 లకు ప్రశంసా పత్రం, రివార్డు ఇచ్చి అభినందించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ప్రతీ సిబ్బంది ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ శ్రీహారి, రిజర్వు ఇన్స్‌పెక్టర్ శైలేంధర్ తదితరులు ఉన్నారు.