కందకుర్తి రామాలయాన్ని దర్శించుకున్న జాతీయ కార్యదర్శి

బోధన్‌, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి విజయ రహక్కర్‌ శుక్రవారం కందకుర్తి గ్రామంలో రామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మహిళ , కిసాన్‌ , ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ మోర్చాల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ రహత్కర్‌ మాట్లాడుతూ తెరాస పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాలన్నారు.

రాష్ట్రంలో ఆడపిల్లకు రక్షణ కరువైందన్నారు. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని విచ్చల విడిగా దోచుకుంటున్నారని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి యువతకు ఉపాధి కల్పించకుండా పబ్బం గడుపుతున్నారని విరుచుకుపడ్డారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా దళిత ముఖ్యమంత్రిని చేయకుండా కేవలం పూటకో మాట మారుస్తున్నారన్నారు.

కెసిఆర్‌ కుటుంబాన్ని ఇంటికి పంపించే సమయం త్వరలోనే వస్తుందని తెలిపారు. 3వ తేదీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ భారీ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు పుల్కల మల్లారెడ్డి, సీనియర్‌ నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, నరసింహ రెడ్డి, గోపాల్‌, బీజేపీ జిల్లా కార్యదర్శి సుధాకర్‌ చారి, అధ్యక్షులు కొలిపాక బలరాజ్‌, పోశెట్టి, కమలాకర్‌, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ రామరాజు, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌, వినోద్‌, ప్రధాన కార్యదర్శి వాసు, అర్వింద్‌, ప్రవీణ్‌, సృజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »