నిజామాబాద్, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రగతి భవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రామానికి గల ప్రాధాన్యతను గుర్తెరిగి, అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు హితవు పలికారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు ఒక నమ్మకమైన వేదికగా నిలుస్తోందన్నారు. ప్రజావాణిలో తమ సమస్యను విన్నవిస్తే తప్పనిసరిగా పరిష్కారం అవుతుందనే గట్టి నమ్మకంతో ప్రజలు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేవిధంగా అధికారులు పని చేసినప్పుడే ప్రభుత్వ యంత్రాంగం పట్ల ప్రజల్లో గౌరవం పెంపొందుతుందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల అధికారులు ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తూ, ఆన్‌లైన్ సైట్‌లో వివరాలను అప్లోడ్ చేసేలా చొరవ చూపాలన్నారు.
నిర్ణీత సమయానికి ముందే ప్రజావాణి కార్యక్రమానికి చేరుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్, డీపీవో జయసుధ, డీఆర్‌డీఓ చందర్, జెడ్పి సీఈఓ గోవింద్, డీఈఓ దుర్గాప్రసాద్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి రaాన్సీ, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.