అనుమతి లేకుండా గోవులు రవాణా చేస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, జూలై 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోవులు అక్రమ రవాణా కాకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. అనుమతి లేకుండా గోవులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధ్రువీకరణ పత్రాలు లేకుండా గోవులను రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

రెవెన్యూ, పోలీస్‌, రవాణా, పశుసంవర్థక, పంచాయతీ, మున్సిపల్‌ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. బక్రీద్‌ వేడుకలు శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. జులై 15 వరకు హైవే పెట్రోలింగ్‌ చేస్తామని తెలిపారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు.

చెక్‌ పోస్ట్‌ల వద్ద వెటర్నరీ వైద్యులు, పోలీసులు ఉంటారని పేర్కొన్నారు. పోలీస్‌ స్టేషన్లో వారిగా శాంతి కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ అన్యోన్య, ఆర్‌డిఓ శీను, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జగన్నాథ చారి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దయానంద్‌, డిపిఓ శ్రీనివాస రావు, హిందూ, మైనార్టీ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »