నిజామాబాద్, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్, వారి సిబ్బంది టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్‌లో కొందరు వ్యక్తులు నిషేధిత గుట్కా, పొగాకు డంప్ ఉన్నదన్న నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ తనీఖీ చేయగా సుమారు 2 లక్షల రూపాయల విలువ గల గుట్కా, పొగాకు స్వాధీనం చేసుకొని టౌన్ 4 పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
నిందితుడు రాజేందర్, నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్ వాసిగా వెల్లడిరచారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు :
అంబర్ 60 ప్యాకేట్లు
ఎక్స్ ఎల్-01 -119 ప్యాకేట్లు.
ఎస్.ఆర్ 01 – 05 ప్యాకేట్లు
విమల్ 98 ప్యాకేట్లు
రాజ్ నివాస్ 173 ప్యాకేట్లు
వి1 టోబాకో – 01 ప్యాకేటు
సాగర్ 59 ప్యాకేట్లు
జండా జర్ధా 20 బాక్సులు
రాణి 3 ప్యాకేట్లు
సూర్య చాప్ తోటా – 1 ప్యాకేటు
పాన్ బహార్ – 3 ప్యాకేట్లు
రకాడా 30 పొచెస్