మాచారెడ్డి, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా టిబి ప్రోగ్రాం అధికారి డా.రవి కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా. ప్రవీణ్ కుమార్‌తో కలిసి పిహెచ్‌సి పరిధిలో ఉన్న టీబీ కేసుల గురించి, వ్యాధిగ్రస్తులకు అందుతున్న చికిత్సల గురించి వాకబు చేశారు.
వ్యాధిగ్రస్తులకు ని-క్షయ పోషణ యోజన పథకం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్స్ క్రింద నెలకు 500రూ.లు అందుతున్నాయా లేదా అని అలాగే వారి చికిత్సా విధానం పూర్తయ్యాక తెమడ పరీక్షలు జరగాలని సూచిస్తూ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దేశం నుండి టీబీని పారద్రోలేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తూ చ తప్పకుండా పాటిస్తూ అందుకు గాను మరింత పటిష్టంగా విధులు నిర్వర్తించాలని,ఆక్టివ్ కేస్ ఫైండిరగ్ కార్యక్రమాల ద్వారా నిరంతరం టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
కార్యక్రమంలో దోమకొండ యూనిట్ టీబీ పర్యవేక్షకులు డా.రాహుల్ కుమార్, ఫార్మసీస్ట్ వెంకట్, సూపర్ వైజర్‌లు మహ్మద్ గౌస్, సంగమణి, నవీన్, ల్యాబ్ టెక్నిషియన్ అరుణ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.