ఐదుగురు విద్యార్థులు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు.

ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 7433 నమోదు చేసుకోగా 6766 మంది హాజరు, 667 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, మూడవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 7739 నమోదు చేసుకోగా 7144 మంది హాజరు, 595 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.

నిజామాబాద్‌ నిశిత డిగ్రీ కళాశాలలో గల పరీక్షాకేంద్రంలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇద్దరు, నిజామాబాద్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో గల పరీక్షాకేంద్రంలో డాటాబేస్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టెంలో ఇద్దరు, ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గల పరీక్షాకేంద్రంలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఒకరు చొప్పున మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్‌ అయినట్లుగా ప్రకటించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »