కామారెడ్డి, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణిలోని పెండిరగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో తహసీల్దార్ లసమావేశంలో మాట్లాడారు. టీఎం33 మాడ్యూల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. అటవీ, రెవెన్యూ భూములపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవో శీను, కలెక్టరేట్ ఏవో రవీందర్, అధికారులు పాల్గొన్నారు.