బోధన్, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు తపాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఇన్స్పెక్టర్ వేణు తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేస్తున్న డబ్బులకోసం బ్యాంకులకు వెళ్లి క్యూ లైన్లలో గంటల తరబడి ఇబ్బందులు పడకుండా దగ్గరలోని పోస్ట్ ఆఫీసుల్లో రైతు బంధు డబ్బులు తీసుకునే అవకాశం తపాలా శాఖ కల్పించిందన్నారు.
పోస్ట్ ఆఫీస్ ద్వారా రైతుబంధు డబ్బులు పొందడానికి రైతులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని పోస్టల్ ఇన్స్పెక్టర్ వేణు కోరారు.