నిజామాబాద్, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణ కోసం, ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని జిల్లా కలెక్టర్ పి .నారాయణ రెడ్డి గారు పిలుపునిచ్చారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్, జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమానికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ఆయన తెలిపారు. బుధవారం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ప్రచార కరపత్రాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం ట్రస్టు గౌరవాధ్యక్షులు డాక్టర్ జెయని నెహ్రూ మాట్లాడుతూ ప్రజలందరూ పూనుకుంటేనే ప్లాస్టిక్ రహిత ఇందూరుగా మనం తీర్చిదిద్దుకోగలుతామని, దీనికోసం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీలలో, ఇతర విద్యా సంస్థలలో, ప్లాస్టిక్ వినియోగం మూలానా జరుగుతున్న నష్టాన్ని వివరించేందుకు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జన విజ్ఞాన వేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామ్ మోహన్ రావు మాట్లాడుతూ పర్యావరణాన్ని, ప్లాస్టిక్ కలుషితం చేస్తోందని, ప్రభుత్వం ప్లాస్టిక్ ఉత్పత్తి చేసే ప్రాంతాలలో నిషేధం విధించాలని, ట్రేడర్స్‌కు ప్లాస్టిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మల్లు స్వరాజ్యం ట్రస్ట్ నాయకులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, కార్యదర్శి రామ్మోహన్రావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు నర్రా రామారావు, నర్సింహులు, కళాకారుడు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.