నిజామాబాద్, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వానాకాలం మొదలైంది…. అందరికీ తెలిసిందే… అయితే మీరు టూ వీలర్, ఫోర్ వీలర్ కలిగి ఉన్నారా… అయితే మీకో విన్నపం. వానాకాలం కాబట్టి వర్షపునీరు రోడ్డుపై అక్కడక్కడ నిలిచి ఉంటుంది. మట్టి రోడ్లయితే రోడ్డంతా చిత్తడిగా, బురద బురదగా మారుతుంది. అక్కడి నుండి నడుచుకుంటూ ఆఫీసులకు, కాలేజీలకు, పాఠశాలలకు వెళ్లే వారు కనబడితే మీ వాహనం కాస్త జాగ్రత్తగా చూసి నడపండని పలువురు కోరుతున్నారు. వాహనం కొంచెం వేగంగా నడపడం వల్ల బురద నీరు వారి డ్రెస్‌లపై పడి మురికిగా మారుతుందని అంటున్నారు. మాకు కూడా అలాగే అనిపిస్తుంది… మరి వాహనదారులు మీకేమనిపిస్తుంది….