కామారెడ్డి, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పని ఒత్తిడిని జయిస్తేనే ఉద్యోగ జీవితంలో విజవంతమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ ఉద్యోగుల క్రియేషన్ రూములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఉద్యోగ జీవితంలో ఉన్న పని ఒత్తిడి జయించి చక్కటి ప్రణాళికతో నిర్వహణ చేపడితే ఉద్యోగిగా విజయం సాధించడం సులువుతోందని తెలిపారు. అంకిత భావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులే ప్రజల మనలను పొందుతారని చెప్పారు. టిఎన్జిఓస్ కామారెడ్డి శాఖ విన్నపం మేరకు ఉద్యోగులకు రిక్రియేషన్ రూమును ఏర్పాటు చేశామన్నారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి కలెక్టర్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. కలెక్టర్‌కు కామారెడ్డి జిల్లా ఉద్యోగుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సాయిలు, ప్రతినిధులు దేవేందర్, సాయి రెడ్డి, జిల్లా కార్యవర్గ బాధ్యులు నాగరాజు, దేవరాజు, సాయిలు, చక్రధర్, లక్ష్మణ్, చిన్న పోచయ్య, గణేష్, రాధకిషన్ రాజ్యలక్ష్మి, రాజేశ్వర్, శ్రీకాంత్, సంతోష్, రాజుకుమార్ పాల్గొన్నారు.