త్యాగానికి ప్రతిరూపం….బక్రీద్‌ పండుగ

నందిపేట్‌, జూలై 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముస్లింల పవిత్ర పండుగలలో ఒకటైన ఈదుల్‌ ఆజహ (బక్రీద్‌ పండుగను) ఆదివారం జరుపుకోవడానికి ఈద్గాప్‌ా, మసీదుల వద్ద ఏర్పాటు జరుగుతున్నాయి. బక్రీద్‌ అంటే బకర్‌ ఈద్‌ అని అర్థం. బకర్‌ అనగా జంతువని, ఈద్‌ అనగ పండుగని అర్థాలు వస్తాయి. ఖుర్బాని ఇచ్చే పండుగ కావున దీనిని ఈదుల్‌ ఖుర్బాని అని, ఖుర్బానీ ఈద్‌ అని పిలుస్తారు.

అరబిక్‌లో ఇదుల్‌ అజహ అని అంటారు. ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్‌ ప్రకారం జిల్‌ హజ్‌ నెలలో బక్రీద్‌ పండుగవస్తుంది. జిల్‌ హజ్‌ నెల పదో రోజున ఈ పండుగ జరుపుకుంటారు. మహ్మదీయులు సంవత్సరాన్ని హిజ్రీ అంటారు. హిజ్రీ అంటే వలసపోవడం అని అర్థం. మహ్మద్‌ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు వెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. మక్కా కు వెళ్లే ఆర్థిక స్తోమత ఉన్న ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్‌ యాత్ర చేయాలన్నది ఇస్లాం సూత్రాల్లో ఒకటి.

త్యాగనిరతతోపాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్‌ పండుగలోని ఆంతర్యం. ఖురాన్‌ ప్రకారం.. భూమిపైకి అల్లాప్‌ా పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం అలైహి సలాం మక్కా నగరాన్ని నిర్మించి నివాసయోగ్యంగా మార్చారు. అల్లహ ఆరాధన కోసం కాబా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరుపొందాడు. ఇబ్రహీంఅలైహి సలాం తనకు లేకలేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్‌ అని పేరు పెట్టాడు.

ఓ రోజు ఇస్మాయిల్‌ మెడపై కత్తిపెట్టి కోస్తున్నట్టు ఇబ్రహీం అలైహి సలాం కలగన్నాడు. అల్లాప్‌ా ఖుర్భాని కోరుతున్నాడమోనని ఓ ఒంటెను బలిస్తాడు. అయినా, మళ్లీ అదే కల రావడంతో తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నారని భావించి ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ద పడతాడు. ఇస్మాయిల్‌ మెడపై కత్తి పెట్టి జుబాప్‌ాకు ఇబ్రహీం అలైహి సలాం ఉద్యుక్తుడవుతుండగా అతని త్యాగానికి మెచ్చిన అల్లాప్‌ా దీనికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్‌ అనే దూత ద్వారా పొట్టేలును పోలిన జీవాన్నీ ఆకాశం నుండి పంపడంతో అతని కుమారుడు అయిన ఇస్మాయిల్‌ బదులు జీవం బలి అయినది. అప్పటి నుంచే బక్రీద్‌ రోజున ఖుర్బాని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ముస్లిం లు అంటున్నారు.

సమర్పణ, త్యాగం.
ఖుర్బాని అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. ఖుర్బాని అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం. దైవానికి సమర్పించడం. దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అయితే, ఖుర్బాని ద్వారా రక్త మాంసాలు సమర్పించడం కాదని, భక్తి, పారాయణత హృదయంలో జనించే త్యాగభావం, భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయని ముస్లింల భావన.

మూడు భాగాలు
ఖుర్బాని ఇచ్చిన మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మూడో భాగాన్నీ తన కుటుంబం కోసం వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్‌ రోజున ఖుర్బాని ఇస్తారు. జిల్‌ హజ్‌ నెల 11, 12 రోజుల్లో కూడా ఖుర్భాని ఇవ్వవచ్చును. అనగా పండుగ మూడు రోజులు జరుపుకొంటారు.

ఆరోగ్యవంతమైన జీవము
ఖుర్భానిగా సమర్పించే జంతువులు అవయవలోపంలేని, ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఒంటె, మేక లేదా గొర్రెను దైవమార్గంలో సమర్పించాలి.

గోవధ నిషేధం
భారత దేశంలో గోవధ నిషేధం కాబట్టి గోవధ చేయరాదు. దేశ చట్టాలను గౌరవిస్తూ గోవధ చేయడం లేదని నందిపేట్‌ మండల ముస్లిం నాయకులు తెలిపారు. స్థోమత కలిగిన ప్రతి ముస్లిం దీనిని విధిగా ఆచరించాలి. అల్లా నియమ నిబంధనల ప్రకారం ఖుర్బానిగా కనీసం ఏడాది వయసున్న మేక, గొర్రెలను బలి ఇవ్వాలి. ఖుర్భాని వడ్డీతో కూడిన రుణంతో చేయరాదు.

గల్ఫ్‌ దేశాలలో శనివారం భక్తి శ్రద్దలతో ఇదుల్‌ అజహ జరుపుకొన్నారు. భారత దేశ వ్యాప్తంగా అదివారం పండుగ జరుపుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా శాంతి పూర్వకంగా పండుగ జరుపుకోవాలని ముస్లిం పెద్దలు కోరారు. ఉదయం 8 గంటల వరకు నమాజ్‌ ఆచరించుకొని ఖుర్బానీ చేయాలని పెద్దలు సూచించారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »