జిల్లా ప్రజలకు ప్రముఖుల బక్రీద్‌, తొలి ఏకాదశి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, జూలై 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :
బక్రీద్‌, తొలి ఏకాదశి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ వేడుక, ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకునే తొలి ఏకాదశి వేడుకలు ఒకేసారి రావడం ఎంతో సంతోషకరమన్నారు.

ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా ప్రజలు ఈ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్‌, ఏకాదశి పుణ్య ఫలంతో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్‌ జిల్లా అన్ని రంగాలలో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావ వాతావరణం వెల్లివిరియాలని కోరుకున్నారు. దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన ప్రజలు ఆదివారం నాటి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »